హైదరాబాద్‌: 9 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు.. గ్యాంగ్‌రేప్‌ కేసులో 23 ఏళ్ల జైలు శిక్ష

By సుభాష్  Published on  27 Jun 2020 9:47 PM IST
హైదరాబాద్‌: 9 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు.. గ్యాంగ్‌రేప్‌ కేసులో 23 ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాద్‌లో ఓ గ్యాంగ్‌ రేప్‌ కేసులు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మదరల్ని ఫ్రెండ్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడిన బావకు, మరొకరికి జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. 2015 అక్టోబర్‌ 16న రాత్రి డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల ఆటో డ్రైవర్‌.. తన మరదలిని ఆమె ఇంటి వద్ద వదిలి పెడతానంటూ ఆటోలో ఎక్కించుకున్నాడు. మార్గ మధ్యంలో ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. దీంతో స్కృహ కోల్పోయిన తర్వాత మరో ఆటో డ్రైవర్‌తో కలిసి మిల్స్‌ ప్రాంగణంలో అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మత్తులో ఉన్న యువతిని ఇంటి వద్ద వదిలి పెట్టే వెళ్లిపోయారు. తర్వాత విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ముషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు ఆటో డ్రైవర్లను అరెస్టు చేశారు. ఇక పోలీసులు ఆధారాలు సేకరించి ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. కాగా, నిందితులిద్దరికి 23 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ.55వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది కోర్టు. ఏది ఏమైనా 9 సంవత్సరాల తర్వాత నిందితులకు శిక్ష పడింది.

Next Story