భారీగా తగ్గిన ఇన్ కమ్ ట్యాక్స్ కలెక్షన్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 5:42 AM GMT
భారీగా తగ్గిన ఇన్ కమ్ ట్యాక్స్ కలెక్షన్లు

కోవిద్-19 కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ఇన్ కమ్ ట్యాక్స్ కలెక్షన్లు కూడా బాగా తగ్గాయి. ఇప్పటికే కంపెనీలు నష్టాల నుండి బయట పడడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.

ఈ ఏడాది ఆగష్టు 10 వరకూ 2020-21కి ట్యాక్స్ కలెక్షన్లు 1.89 లక్షల కోట్లు కాగా గత ఏడాది ఇదే సమయానికి 2.50 లక్షల కోట్ల కలెక్షన్లు నమోదయ్యాయి. రెండు ఏడాదిలకు కలిపి ఇన్ కమ్ ట్యాక్స్ కలెక్షన్లను పోల్చి చూస్తే - 24.5 శాతం లోటు కనిపిస్తోంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టెడ్ ట్యాక్సెస్ 2020-21 కాలంలో 13.19 లక్షల కోట్ల ను టార్గెట్ గా పెట్టుకుంది. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది వీలయ్యే అవకాశమే లేదు. ఎన్నో బిజినెస్ లు బాగా నష్టాలను చవిచూస్తూ ఉండగా.. మిగిలిన బిజినెస్ సామ్రాజ్యాలు కుప్ప కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి.

తాజా గణాంకాల ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఆగష్టు 10 మధ్య ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలో 59,881.1 కోట్ల ట్యాక్స్ కలెక్షన్లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 65,429 కోట్ల రూపాయల ట్యాక్స్ కలెక్షన్లు నమోదయ్యాయి. ఇది -8.5 శాతం లోటుగా తెలుస్తోంది. కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్లు 27,244.9 కోట్లు కాగా.. ఇన్కమ్ ట్యాక్స్ 27015.2 కోట్లు. ఢిల్లీ రీజియన్ లో ఈ ఏడాది 25,027.3 కోట్ల రూపాయల ట్యాక్స్ కలెక్షన్లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 37,363.1 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదయ్యాయి. -33 శాతం తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్లు నమోదయ్యాయి.

బెంగళూరు రీజియన్ లో మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్లు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. ఈ ఏడాది 30,755.1 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 27,455.6 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్లు నమోదయ్యాయి. 12 శాతం వృద్ధి బెంగళూరు రీజియన్ లో చోటు చేసుకుంది. కార్పొరేట్ ట్యాక్స్ 12,705 కోట్ల రూపాయలు నమోదవ్వగా.. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 17,883.6 కోట్ల రూపాయలు వసూలు అయింది. కర్ణాటక రాష్ట్రంలో లాక్ డౌన్ ను తొందరగా సడలించడమే బెంగళూరు రీజియన్ లో ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్లు బాగుండడానికి కారణమని అంటున్నారు నిపుణులు.

ఆంధ్ర-తెలంగాణలకు చెందిన ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు హైదరాబాద్ ఐటీ రీజియన్ కిందకు వస్తుంది. ఇప్పటి వరకూ 10,517.7 కోట్ల రూపాయల ట్యాక్స్ నమోదవ్వగా.. గత ఏడాది ఇదే సమయానికి 14,957 కోట్ల రూపాయలు నమోదయ్యింది. గత ఏడాదితో పోలిస్తే -29.7 శాతంగా ఉందట. కార్పొరేట్ ట్యాక్స్ 3225.6 కోట్ల రూపాయలు కలెక్ట్ అవ్వగా.. ఇన్కమ్ ట్యాక్స్ 7175.7 కోట్లు కలెక్ట్ అయ్యింది. హైదరాబాద్ రీజియన్ లో ఈ ఏడాది 73,809 కోట్ల రూపాయల ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ పెట్టుకోగా అది కుదరదనే అర్థం అవుతోంది.

చెన్నై రీజియన్ లో 11,523 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు నమోదయ్యాయి.. గత ఏడాది ఇదే సమయానికి 19, 432 కోట్ల రూపాయలు నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే అది -40.7 శాతం తక్కువ. లక్నో రీజియన్ లో -43.5 శాతం, జైపూర్ రీజియన్ లో -30.7 శాతం, భువనేశ్వర్ రీజియన్ లో -33.6 శాతం, పూణే -37.4 శాతం, అహ్మదాబాద్ రీజియన్ లో -44.1 శాతం, పాట్నాలో -33.1 శాతం, కలకత్తా రీజియన్ లో -60.8 శాతం తక్కువగా ట్యాక్స్ కలెక్షన్లు నమోదయ్యాయి.

Next Story
Share it