కృష్ణా జిల్లాలో భారీ పేలుడు.. 2కిమీ వరకు శబ్దం.!
By తోట వంశీ కుమార్ Published on 1 Aug 2020 11:50 AM ISTకృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ శబ్దం దాదాపు 2 కిమీ వరకు వినిపించింది. భారీ శబ్దం వినిపించడంతో ఏం జరిగిందో తెలియక ప్రజలు కాసేపు భయ బాంత్రులకు గురైయ్యారు.
వేకనూరు గ్రామానికి చెందిన తుంగల దిలీప్ పశువుల పాక నుంచి రాత్రి 8.45 గంటలకు భారీ పేలుడు సంభవించింది. సమీపంలోని పలు ప్రజల ఇళ్ల గోడలపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ శబ్దం దాదాపు 2 కి.మీ మేర వినిపించడంతో.. చుట్టు ప్రక్కల ప్రజలు ఏమి జరిగిందో అర్థం కాక భయబ్రాంతులకు గురయ్యారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ రమేష్ రెడ్డి, సీఐ బీబీ రవికుమార్, ఎస్సై సందీప్‌లు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పశువు చావిడిలో యూరియా బస్తాల వద్ద పేలుడు జరిగిందని, సోడియం నైట్రేట్, అమోనియంలను నిల్వ ఉంచడం వల్ల ఒత్తిడికి గురై పేలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.