మద్యం ప్రియులకు భారీ షాక్.. పెరగనున్న మద్యం ధరలు..!

By సుభాష్  Published on  4 May 2020 8:19 AM IST
మద్యం ప్రియులకు భారీ షాక్.. పెరగనున్న మద్యం ధరలు..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కారణంగా లాకొనసాగుతోంది. దీంతో అన్ని షాపులతో మద్యం షాపులు సైతం మూతపడ్డాయి. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం భారీగానే తగ్గిపోయింది. మద్యం షాపుల మూతతో మద్యం ప్రియులకు పెద్ద షాకిచ్చినట్లు అయ్యిందంటే.. ఇప్పుడు మరో షాక్ తగలనుంది. ధరలు ఆకాశాన్నంటనున్నాయి. ఇప్పటికే ఏపీ సర్కార్ మద్యం ధరలను పెంచేసింది.

ఈ విధంగా రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు రాజస్థాన్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలోనే భాగంగా ఇక నుంచి మద్యం విక్రయాలపై ఎక్సైజ్ డ్యూటీని మరింత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలో ఇండియా మేడ్ ఫారిన్ మద్యంతో పాటు బీరుపై 35 శాతం, ఇతర లిక్కర్ విక్రయాలపై 45శాతం ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఎక్సైజ్ డ్యూటీ పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని రాజస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్సైజ్ యాక్ట్ 1950 సెక్షన్ 28 ప్రకారం.. మద్యం ధరలపై ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రాల ఆదాయం భారీగా పడిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరీ మిగతా రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందా.. అనేది చూడాలి.

కాగా, గత రెండు రోజుల కిందట దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మద్యం అమ్మకాలు సైతం జరుపుకోవచ్చని ప్రకటిస్తూ, కొన్ని నిబంధనలను విధించింది. షాపుల వద్ద ఒకే సారి ఐదుగురికంటే ఎక్కువ ఉండవద్దని, మనిషికి మనిషికి మధ్య ఆరు అడుగుల దూరం ఉండాలని సూచించింది.

Next Story