1873 మద్యం బాటిళ్ల పట్టివేత.. ఆలస్యంగా వెలుగులోకి.. కారణం ఏమిటీ?

By సుభాష్  Published on  2 May 2020 8:01 AM GMT
1873 మద్యం బాటిళ్ల పట్టివేత.. ఆలస్యంగా వెలుగులోకి.. కారణం ఏమిటీ?

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా మద్యం షాపులు పూర్తిగా మూతపడ్డాయి. ఇక లాక్‌డౌన్‌ అమలవుతున్న వేళ తెలంగాణలో అక్రమం మద్యం తరలింపు ఆగడం లేదు. ఇప్పటికే మద్యాన్ని బ్లాక్‌ లో విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు కూడా. ఇక తాజాగా మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాయిలాపూర్‌ గ్రామంలో భారీగా మద్యం పట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.

ఏప్రిల్‌ 30న అర్ధరాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా, టాటా ఏస్‌ వాహనంలో అక్రమంగా 1873 మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌ నరేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ మద్యం విలువ సుమారు రూ.8 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు.

అయితే ఈ ఘటన ఏప్రిల్‌ 30న జరిగితే. మీడియాకు తెలియకుండా రహస్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

Next Story