దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మే 3వ తేదీ వరకూ ఉన్న లాక్‌డౌన్‌ను మే 17వ తేదీ వరకు పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అన్ని షాపులతో పాటు మద్యం షాపులు సైతం మూసి ఉండటంతో మద్యం ప్రియులు నానా అవస్థలకు గురవుతున్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మద్యం అమ్మకాలపై ఆంక్షలు సడలించింది. కంటైన్‌మెంట్‌ ప్రాంతాలే కాకుండా గ్రీన్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్‌, రెడ్‌ జోన్‌లలో కూడా మద్యం అమ్మకాలు కూడా కొనసాగించవచ్చని తెలిపింది. అయితే కొన్ని నిబంధనలు విధించింది. ఈ మద్యం అమ్మకాలు మే 4వ తేదీ నుంచి కొనసాగనున్నాయి.

మద్యం షాపుల వద్ద వినియోగదారులు సామాజిక దూరం (ఆరు అడుగులు) పాటించాలని సూచించింది. అలాగే షాపుల వద్ద ఒకే సారి ఐదుగురికి మించి ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కూడా మద్యం షాపు యజమానులు కూడా జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని తెలిపింది. మార్కెట్‌ ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకణాలు, రెడ్‌ జోన్‌లలోని మాల్స్‌లో ఉన్న వాటికి వెలుసుబాటు వర్తించదు. అలాగే గ్రీన్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌లలో ఉన్న సెలూన్లు తెరుచుకోవచ్చని తెలిపింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.