దేశ ప్రజల్ని వణికిస్తున్న ఆ నాలుగు రాష్ట్రాలు.. భారీగా కేసులు.. మరణాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Aug 2020 5:48 AM GMTమాయదారి కరోనా మన దేశంలోకి వచ్చి.. అది బాగా వ్యాపించిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టమన్న విశ్లేషణ ఎప్పటి నుంచో ఉన్నదే. ముందస్తు జాగ్రత్తల పుణ్యమా అని లాక్ డౌన్ వేళ.. కరోనా కోరల నుంచి భారతీయులు తప్పించుకున్నారు. ఎప్పుడైతే అన్ లాక్ తీశారో.. అప్పటి నుంచి కొత్త కేసుల కష్టాలు పెరగటం మొదలైంది. అది అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఎక్కడి వరకు వెళుతుందన్న అంచనా వేసేందుకు భయాందోళనలకు గురవుతున్నాయి.
తాజాగా రోజుకు అరవై వేల కేసుల వరకు నమోదయ్యే పరిస్థితి. దీనికి కారణం.. దేశ ప్రజల్లో చాలామంది ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించటమే. తమకేమీ కాదన్న ధీమాతో చేస్తున్న చేష్టలతో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. అదే సమయంలో.. ఈ వైరస్ ఒకసారి ఇంట్లోకి చేరితే.. ఏం చేయాలో అర్థం కాక షాక్ తింటున్నారు. మరికొందరు తమకేం కాదన్న ధీమాతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
అదే సమయంలో.. పాజిటివ్ గా తేలిన తర్వాత కూడా రోగాన్ని గుట్టుగా ఉంచేసుకొని.. కేసుల్ని వ్యాపించేసే ధోరణి కూడా పెరుగుతోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సింహభాగం నాలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా చెప్పక తప్పదు. మహారాష్ట్ర.. ఆంధ్రప్రదేశ్.. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాలు కీలకం. మిగిలిన రాష్ట్రాలు ఉన్నా.. వీటి కంటే తక్కువ ప్రభావాన్ని కలిగి ఉన్నాయి.
మహారాష్ట్రలో రోజు తిరిగేసరికి 13వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఏపీ విషయానికి వస్తే పది వేల అంకెను రోజుూ చాలా ఈజీగా దాటేస్తున్న పరిస్థితి. ఇక.. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో ఆరువేల కేసులకు దగ్గరకువచ్చేశారు. ఢిల్లీలో కేసుల సంఖ్యను బాగా తగ్గేలా చేసినా.. రోజు తిరిగేసరికి పదమూడు వందల కేసులు ఇప్పటికి నమోదవుతున్నాయి. అదే రీతిలో కర్ణాటకలోనూ దగ్గర దగ్గర రోజుకు ఆరు వేల కేసుల వరకు వచ్చేశాయి. కొత్త కేసులే కాదు.. మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. ఇలాంటివేమీ రిపోర్టు చేయలేని పరిస్థితి ఉందన్న ఆరోపనలు వెల్తువెత్తుతున్ానయి. ఏమైనా.. కొత్తకేసులు.. మరణాలు దేశాన్ని వెంటాడి మరీ వేధిస్తున్నాయని చెప్పక తప్పదు.