దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ

By అంజి  Published on  21 Dec 2019 5:54 AM GMT
దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: దిశ హత్య ఘటన నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్‌ జస్టిస్‌ ముందు హాజరైన గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ హాజరయ్యారు. ఈ నెల 9న నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి వచ్చాయి. మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయని, -2 డిగ్రీల సెల్సీయస్‌ ఫ్రీజర్‌లో మృతదేహాలు ఉంచామని తెలిపారు. మరో వారం పది రోజుల్లో మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోతాయి శ్రవణ్‌ కోర్టుకు తెలిపారు. దేశంలో ఇతర ఆస్పత్రుల్లో మృతదేహలను భద్రపర్చేందుకు అవకాశం ఉందా అన్న హైకోర్టు ప్రశ్నించింది. అయిత తనకు తెలియదన్న గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన వైద్యలు వివరాలను అడ్వకెట్‌ జనరల్‌ కోర్టుకు సమర్పించారు. మృతదేమాలకు రీపోస్టుమార్టం అవసరం లేదని ఏజీ పేర్కొన్నారు. ఫొరెన్సిక్‌ హెచ్‌వోడీ ఠాకూర్‌ కృపాల్‌ సింగ్‌ ఆధ్వర్యంలో మృతదేహాలకు పోస్టుమార్టం చేశారని ఏజీ తెలపారు.

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎల్లుండి సాయంత్రంలోగా రీపోస్టుమార్టం రిపోర్టు సమర్పించాలని పేర్కొంది. రీపోస్టుమార్టం ముగియగానే మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

Next Story
Share it