కొత్త సచివాలయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
By సుభాష్ Published on 27 Jan 2020 10:00 PM ISTతెలంగాణ కొత్త సచివాలయానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. నూతన సచివాలయానికి సంబంధించిన డిజైన్లు, ప్రణాళికలపై తుది నిర్ణయం తీసుకోవడానికి సర్కార్‌కు అనుమతి ఇచ్చింది హైకోర్టు. నిర్మాణానికి సంబంధించి డిజైన్లు,ప్లాన్,బడ్జెట్ తుది నిర్ణయాన్ని ఫైనల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇక సర్కార్ తీసుకునే నిర్ణయాలను ఫిబ్రవరి 12వ తేదీలోపు హైకోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మిస్తున్నట్లు చేసిన ప్రకటనపై వివిధ పార్టీలు వ్యతిరేకించాయి. ఉన్న భవనాన్ని వదిలేసి కొత్త సచివాలయాన్ని నిర్మించడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని ఆరోపణలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయానికి అనుమతి ఇవ్వద్దంటూ గతంలో కోర్టులో పిటిషన్ దాఖలు కూడా అయ్యాయి.
Next Story