తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీఎల్ విశ్వేశ్వర్ రావు దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. దీంతో పాత స‌చివాల‌యం కూల్చివేసి.. కొత్త స‌చివాల‌యం నిర్మించాల‌న్న‌ తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని హైకోర్టు స్వాగ‌తిచ్చిన‌ట్ట‌య్యింది.

కూల్చివేతకు కేంద్రం అనుమతులు అవసరం లేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అన్నారు. కొత్త‌ నిర్మాణాలు చేపట్టడానికే మా అనుమతులు కావాలని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. ల్యాండ్ ప్రిపరేషన్‌లోనే భవనాల కూల్చివేత వస్తుందని వాదించిన పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర పర్యావరణ అనుమతి అవసరం లేదని సోలిసీటర్ జనరల్ వాదనను ఏకీభవించింది హైకోర్టు. ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుని కూల్చివేత పనులను చేపడుతుంది. కోవిడ్-19 దృష్టిలో ఉంచుకుని పనులు జరుపుకోవాల‌ని హైకోర్టు సూచించింది.

అంత‌కుముందు.. తెలంగాణ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్‌ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో పాత భవనాలు కూల్చివేసి వాటి స్థానంలో కొత్త భ‌వ‌నాలు నిర్మించాలన్న కేబినెట్ నిర్ణ‌యానికి సుప్రీం తీర్పుతో ఊరట లభించిన‌ట్ట‌య్యింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 136 ప్రకారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

సచివాలయం కూల్చివేత‌ వివాదంపై తెలంగాణ హైకోర్టు ఇప్పటికే సమగ్రంగా పరిశీలిస్తోందని.. ఈ సమయంలో తాము ఎటువంటి ఆదేశాలను ఇవ్వలేమంటూ న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ అశోక్‌ భూషన్‌ ధర్మాసనం శుక్రవారం పిటిషన్‌ను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort