ఢిల్లీ అంతర్జాతీయ విమానశ్రయంలో ఆర్డీఎక్స్ లభించడంతో.. సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆరైవల్స్ ర్యాంపు వద్ద భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓ కారులో ఆర్డీఎక్స్ వున్న‌ట్లుగా సీఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు ర్యాంపు వద్ద వున్న కారులో తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ ల‌తో ముమ్మర తనిఖీలు చేప‌ట్టారు. కారులో పేలుడు పదార్దాలు వు‌న్నట్లుగా మాక్ డ్రిల్ నిర్వహించిన భద్రతా బలగాలు.. అనుమానిత వ్యక్తులు, వస్తువుల పట్ల అప్రమత్తంగా వుండాలని ప్ర‌యాణికుల‌ను హెచ్చరించారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.