ఢిల్లీలో ఒక్కసారిగా మారిత వాతావరణం..!
By అంజి
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం పడుతోంది. ఢిల్లీలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణ పరిస్థితలు పూర్తిగా మారిపోయాయి. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. కాన్ స్టిట్యూషన్ క్లబ్, లోధి రోడ్, పార్లమెంట్, ఆర్ కే పురం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నీరు నిలిచిపోయింది. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వర్షం నీళ్లు రోడ్లపైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులోకి కూడా భారీగా వర్షం నీరు వచ్చింది. అటు అధికారులు ఎయిర్ పోర్టు రన్ వేను తాత్కాలికంగా మూసివేశారు. ఢిల్లీలో ల్యాండ్ కావాల్సిన పలు విమానాలను జైపూర్, లక్నో, జోథ్ పూర్ లకు దారి మళ్లీస్తున్నారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో రాత్రి 10 గంటల సమయానికి ఉష్ణోగ్రత 12.8 డిగ్రీలుగా నమోదైంది. చలికాంలో ఇదే అత్యల్పమని వాతావరణశాఖ అధికారి కుప్ దీప్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసాయి.