బలహీనపడిన బుల్‌బుల్.. బెంగాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Nov 2019 11:03 AM ISTఢిల్లీ: వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుపాను 'బుల్‌బుల్' బలహీన పడింది. అనంతరం ఈశాన్య దిశగా ప్రయాణించి పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మధ్య అర్థరాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో బెంగాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు మత్య్సకారులను హెచ్చరించారు.
బుల్‌బుల్ తుపాను నేపథ్యంలో సహాయక చర్యలకు అప్రమత్తంగా ఉన్నట్లు తూర్పు నౌకాదళం ప్రకటించింది. ఈఎన్‌సీ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో సహాయక సామగ్రితో మూడు నౌకల్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఎయర్‌క్రాఫ్ట్‌ల ద్వారా నష్టాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే నిర్వహించి.. తీవ్రతను గమనించి ఆయా ప్రాంతాలకు రిలీఫ్ మెటీరియల్ అందించనున్నామని తూర్పు నౌకాదళాధికారులు తెలిపారు.