హైదరాబాద్‌లో పౌరసత్వ నిరసన సెగలు.. రంగంలోకి దిగిన పారా మిలటరీ

By సుభాష్  Published on  20 Dec 2019 9:39 AM GMT
హైదరాబాద్‌లో పౌరసత్వ నిరసన సెగలు.. రంగంలోకి దిగిన పారా మిలటరీ

ముఖ్యాంశాలు

  • హైదరాబాద్‌లో ఉద్రిక్తత

  • రంగలోకి దిగిన పారా మిలటరీ

  • పలువురి అరెస్టు

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సరవణ బిల్లుపై ఆందోళనలు, నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఈనేపథ్యంలో ఈ పౌరసత్వ సెగలు హైదరాబాద్‌ కూడా తాకాయి. దీంతో హైదరాబాద్‌లో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్‌, మసీదుల వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. పారా మిలటరీ ఫోర్స్‌ను రంగంలోకి దింపి భారీ బందోబస్తు ఏర్పాటు ఏర్పాటు చేశారు. గత రెండు రోజుల కిందట మజ్లిస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రార్థనల అనంతరం ర్యాలీ నిర్వహిస్తామని మరోసారి ప్రకటించడంతో పోలీసులు పాతబస్తీ మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు.

Heavy Protest Hyderabad1

పాబబస్తీలో టెన్షన్‌ వాతావరణం:

పాతబస్తీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రార్థనల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా పారా మిలటరీ ఫోర్స్ ను రంగంలోకి దిగారు. బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తుండగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తతకు వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన అదనపు బలగాలు ఆందోళనకారులను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.

Next Story