లిస్బన్‌ రెస్టోబార్‌ పబ్‌లో అరాచకం.. 31 మంది అరెస్ట్‌..!

By అంజి  Published on  19 Dec 2019 3:46 AM GMT
లిస్బన్‌ రెస్టోబార్‌ పబ్‌లో అరాచకం.. 31 మంది అరెస్ట్‌..!

ముఖ్యాంశాలు

  • లిస్బన్ పబ్‌పై వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
  • పబ్ లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతి,యువకులు
  • పక్కా సమాచారంతో పబ్ పై దాడులు నిర్వహించిన పోలీసులు
  • 30 మంది అరెస్ట్, పంజాగుట్ట పీఎస్‌కు తరలింపు

హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బేగంపేటలో ఉన్న లిస్బన్‌ రెస్టోబార్‌ అండ్‌ పబ్‌పై బుధవారం రాత్రి వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతోనే పబ్‌పై వెస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్‌లో నిర్వహకుల్లోని ముగ్గురు వ్యక్తులు అసభ్యకర చర్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కాగా అశ్లీల చర్యలకు పాల్పడడంతో ఐపీసీ సెక్షన్‌ 294 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో 30 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లిస్బర్‌ రెస్టోబార్‌కు ఎక్కువగా జులాయిగా తిరిగేవారే హాజరువుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. అయితే పబ్‌లో ఎలాంటి అనైతిక అక్రమ రవాణా, నగ్నంగా డ్యాన్స్‌లు చేయడం లేదన్నారు. వారిని అరెస్ట్‌ చేసి పోలీసులు అనైతిక చర్యకు పాల్పడ్డాని పబ్‌ నిర్వహకులు ఆరోపించారు. 2019 జూన్‌లో పబ్‌లో డ్యాన్సర్‌ చేత వ్యభిచారం చేయించాలని పబ్‌ నిర్వహకుడు ప్రయత్నించాడు. అయితే ఆ డ్యాన్సర్‌ ఎంతుకు ఒప్పుకోకపోవడంతో ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. ఈ ఘటనపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది.

వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్పెక్టర్‌ గట్టు మల్లు మాట్లాడుతూ.. పబ్‌లో మహిళలు ఎలాంటి నగ్న డ్యాన్స్‌లు చేయడం లేదన్నారు, కానీ పబ్‌లో డ్యాన్స్‌ చేసే మహిళలు అశ్లీలతను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. తమ టాస్క్‌ఫోర్స్‌ బృందం మొదటగా కస్టమర్ల రూపంలో పబ్‌ లోపలికి వెళ్లింద్నారు. తమ సిబ్బంది లిస్బన్‌ రెస్టోబార్‌ అండ్‌ పబ్‌లో సరిగ్గా దుస్తులు ధరించకుండా డ్యాన్స్‌ చేస్తున్న మహిళ ఫొటోలు తీసుకున్నారని, ఆ తర్వాత పబ్‌లో రైడ్‌ చేసి 31 మందిని అదుపులోకి తీసుకున్నారని ఆయన అన్నారు. పబ్‌లో అసాంఘిక కార్యాక్రమాలకు పాల్పడుతున్నారని తెలపడానికి తమ సిబ్బంది వద్ద ఉన్న ఫొటోలు రుజువు చేస్తాయని పేర్కొన్నారు.

మహిళపై దాడి కేసులో చార్జీషీట్‌ దాఖలు చేశాము: ఇన్స్పెక్టర్‌ శ్రీకాంత్‌

వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తమకు 31 మందిని కస్టడీకి ఇచ్చారని పంజాగుట్ట పోలీస్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీకాంత్ గౌడ్‌ తెలిపారు. అరెస్ట్‌ అయినవారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, త్వరలోనే నోటీసులు ఇచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇది బెయిలబుల్‌ నేరం కాబట్టి, తదనుగుణంగా ఈ కేసును డీల్‌ చేస్తామని శ్రీకాంత్‌గౌడ్‌ అన్నారు. పబ్‌లో వ్యభిచారం జరగలేదని, మహిళలు దుస్తులు ధరించి అసభ్యకరంగా డ్యాన్స్‌లు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు. టాలీవుడ్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌పై దాడి కేసుకు సంబంధించిఇ ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు పోలీసులు తెలిపారు. పబ్‌ నిర్వహకులకు స్థానిక రాజకీయ నాయకుడి అండ ఉందని అందుకే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మొదట్లో బాధితురాలు ఆరోపించింది. కొత్త సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో, పబ్‌లో అశ్లీలత ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆరోపణలు రావడంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story