నకిలీ కరోనా వ్యాక్సిన్లతో జాగ్రత్త..!

How to identify fake Covid-19 vaccine Govt issues guidelines. అంతర్జాతీయ మార్కెట్లో నకిలీ కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లు చలామణీలో ఉన్నాయంటూ

By Medi Samrat  Published on  5 Sep 2021 12:01 PM GMT
నకిలీ కరోనా వ్యాక్సిన్లతో జాగ్రత్త..!

అంతర్జాతీయ మార్కెట్లో నకిలీ కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లు చలామణీలో ఉన్నాయంటూ వస్తున్న కథనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నకిలీ కరోనా వ్యాక్సిన్లపై రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. నకిలీ వ్యాక్సిన్, ఒరిజినల్ వ్యాక్సిన్ల మధ్య తేడాలను గుర్తించడంపై కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యాక్సిన్ పై ఉన్న లేబుల్, రంగు, ఇతర వివరాల ద్వారా ఫేక్ వ్యాక్సిన్లను గుర్తించవచ్చని రాష్ట్రాలకు వివరించింది. ప్రస్తుతం భారత్ లో కోవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడింటికి సంబంధించి అసలైన వ్యాక్సిన్లను గుర్తించడంపై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. దేశంలో నకిలీ వ్యాక్సిన్లను గుర్తించేందుకు విచారణ చేపట్టినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి ముఖేశ్ మాండవీయ వెల్లడించారు.

ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలలో ఆస్ట్రాజెనెకా/ఆక్స్ ఫర్డ్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల డూప్లికేట్ వెర్షన్లను కనుగొన్నట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. ఈ నకిలీ కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాక్సిన్, రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి భారత్ లో ఇస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు ఒరిజినల్ లేదా నకిలీదా అని చెక్ చేయడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.

కోవిషీల్డ్

కోవిషీల్డ్ బాటిల్ ఈ క్రింది వివరాలు ఉండాలి

ఎస్ఐఐ ప్రొడక్ట్ లేబుల్

ట్రేడ్ మార్క్ తో బ్రాండ్ పేరు(కోవిషీల్డ్) ఉండాలి

జనరిక్ పేరు ఫాంట్ అన్ బోల్డ్ గా ఉంటుంది

"(రీకాంబినెంట్)" అదే ఫాంట్ తో జనరిక్ పేరు దిగువ ఉంటుంది.

సీజీఎస్ సేల్ స్టాంప్ కొరకు కాదు.

ఎస్ఐఐ లోగో కచ్చితంగా ఉండాలి.

లేబుల్ కలర్ షేడ్ ముదురు ఆకుపచ్చరంగులో ఉంటుంది. అల్యూమినియం ఫ్లిప్ ఆఫ్ సీల్ అనేది ముదురు ఆకుపచ్చరంగులో ఉంటుంది.

కొవాక్సిన్

బుడ్డి లేబుల్ మీద డీఎన్ఎ వంటి నిర్మాణం ఉంటుంది.

కోవాక్సిన్ స్పెల్లింగ్ "ఎక్స్"లో గ్రీన్ కలర్ ఉంటుంది.

కొవాక్సిన్ స్పెల్లింగ్ పై హోలో గ్రాఫిక్ ఎఫెక్ట్ ఉంటుంది.

స్పుత్నిక్

రెండు బల్క్ తయారీ సైట్‌లకు వేర్వేరు లేబుల్స్ ఉంటాయి. తయారీదారు పేరు మినహా అన్ని ఇతర సమాచారం, డిజైన్ ఒకే విధంగా ఉంటాయి. దిగుమతి చేసుకున్న అన్ని ఉత్పత్తుల ప్యాక్ కార్టన్ ముందు, వెనుక మాత్రమే ఇంగ్లీష్ లేబుల్ అందుబాటులో ఉంది. టీకా ఆంపౌల్‌లోని ప్రాథమిక లేబుల్‌తో సహా అన్ని ఇతర వైపులా రష్యన్ లిపిలో ఉంటాయి.


Next Story