ముల్లెయిన్ టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు
ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలో పండించే ముల్లెయిన్ లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల దీనిని మంచి ఆరోగ్యకరమైన హెర్బ్ అని పిలుస్తారు
By Medi Samrat Published on 10 May 2024 4:00 AM GMTఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలో పండించే ముల్లెయిన్ లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల దీనిని మంచి ఆరోగ్యకరమైన హెర్బ్ అని పిలుస్తారు. ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను తొలగించడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముల్లెయిన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముల్లెయిన్ టీ అనేది ముల్లెయిన్ జాతి మొక్కల ఆకుల నుండి తయారైన మూలికా టీ. ముల్లెయిన్ టీ ఉబ్బసం, జలుబు, దగ్గు, ఇతర శ్వాసకోశ సమస్యలతో పాటు అనేక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనాన్ని ఇస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ముల్లిన్ టీ రెసిపీ
ముల్లిన్ టీ కోసం గ్యాస్‌పై ఒకటిన్నర కప్పు నీరు ఉంచండి, అందులో 1-3 చెంచాల పొడి ముల్లెయిన్ ఆకులను వేసి 15 నిమిషాలు వేడి చేసిన తరువాత దానిని స్ట్రైనర్ ద్వారా ఫిల్టర్ చేసి తాగి ఆస్వాదించండి.
ముల్లెయిన్ టీ యొక్క ప్రయోజనాలు
ఇది శ్వాసకోశ సమస్యలను పరిష్కరించడంలో ఉపయోగబడుతుంది. ఇది జలుబు, దగ్గు, గొంతు నొప్పి, చికాకు, వాపు తగ్గించడం, శ్లేష్మం క్లియర్ చేయడం, బ్రోన్కైటిస్, ఆస్తమా వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
ఆస్తమాకు ఉపశమనం
ముల్లెయిన్ టీ వాపును తగ్గిస్తుంది. శ్వాసను సులభతరం చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
దగ్గుకు..
ముల్లెయిన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇది దగ్గును తొలగిస్తుంది. ఔషధ గుణాలు కలిగిన ముల్లెయిన్ టీ పేరుకుపోయిన శ్లేష్మాన్ని(కఫం) తొలగించడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది
ముల్లెయిన్ టీలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి పురాతన కాలం నుండి దీనిని ఉపయోగిస్తున్నారు.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలం
ముల్లెయిన్ టీలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ఊపిరితిత్తులు, చెవులు, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని రెగ్యులర్ వినియోగంతో చర్మ సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
నిద్ర మెరుగుకు..
నిద్ర నాణ్యతను ప్రోత్సహించడానికి ముల్లెయిన్ టీ ఉపయోగించబడింది. దీన్ని తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది.