హాజీపూర్‌ వరుస హత్యల కేసు.. పోలీసులకు హైకోర్టు నోటీసులు..

By అంజి  Published on  11 March 2020 6:40 AM GMT
హాజీపూర్‌ వరుస హత్యల కేసు.. పోలీసులకు హైకోర్టు నోటీసులు..

ముఖ్యాంశాలు

  • శ్రీనివాస రెడ్డికి ఉరిశిక్ష ధ్రువీకరించాలని హైకోర్టును కోరిన పోలీసులు
  • నల్గొండ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసిన శ్రీనివాస్ రెడ్డి
  • రెండింటినీ కలిపి విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయం

యాదాద్రి భువనగిరి: హాజీపూర్‌ వరుస హత్యాచారాల కేసు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి చేరింది. శ్రీనివాస్‌రెడ్డికి విధించిన ఉరిశిక్షణు ధ్రువీకరించాలని పోలీసులు హైకోర్టును కోరారు. కాగా నల్గొండ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అప్పీల్‌ దాఖలు చేశాడు. రెండింటినీ కలిపి విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెలలో నల్గొండ జిల్లా కోర్టు దోషిగా తేలిని శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్షణను విధించింది. కాగా ఈ కేసు ప్రొసీడింగ్స్‌ను రిఫర్‌ ట్రయల్‌ నిబంధన కింద నల్గొండ కోర్టు.. హైకోర్టుకు సిఫారసు చేసింది. మంగళవారం నాడు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వివరణ సమర్పించాలని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Also Read: తెలంగాణలో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి అంటే..

హాజీపూర్‌ వరుస హత్య కేసులో నల్గొండ ఫోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సైకోకిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. ముగ్గురు మైనర్‌ బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో ఈ తీర్పు వెలువరించింది. 90 రోజుల్లో విచారణ పూర్తి చేసిన కోర్టు.. మొత్తం 101 మంది సాక్షులను విచారించింది. శ్రీనివాస్‌ రెడ్డిపై నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష విధిస్తున్నట్లు జడ్జి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్యల కేసుల్లో శ్రీనివాస్‌ రెడ్డి దోషిగా తేల్చింది. అతడికి ఉరే సరైన శిక్ష అని కోర్టు అభిప్రాయపడింది. శ్రవణి కేసులో ఉరిశిక్ష, కల్పన కేసులో ఉరిశిక్ష, మనీషా కేసులో జీవిత ఖైదుగా విధించింది. ఈ కేసులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోక్సో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఫిబ్రవరి 6న తుది తీర్పునిచ్చింది.

Also Read: చిరుత కూనలకు ఎక్కడకు వెళ్ళాలో తెలియక.. అక్కడ ఇరుక్కుపోయాయి

Next Story