తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు ఒంటిపూట బడులను ప్రకటించింది ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం అవుతాయని పాఠశాల విద్యా కమిషనర్‌ చిత్రా రామచంద్రన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. ఇక వార్షిక పరీక్షల అనంతరం ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు. తిరిగి జూన్‌ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.