హర్యానా ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇక్కడి జులనా స్థానంపై అందరి దృష్టి ఉంది. ఇక్కడి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేగా జేజేపీకి చెందిన అమర్జీత్ ధండా ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ ఒలింపియన్ రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను రంగంలోకి దించింది. కెప్టెన్ యోగేష్ ను బీజేపీ ఆమెపై పోటీకి దించింది. రెజ్లర్ కవిత దుగ్గల్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో ఈ ఫలితంపై అందరి చూపు ఉంది.
15 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం.. జులనా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ దాదాపు 6000 పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్ధిపై గెలిచింది. అయితే ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ అభ్యర్థి కెప్టెన్ యోగేష్ బైరాగి ఆధిక్యంలో ఉండగా.. చివర రౌండ్లలో ఆయన వెనకబడ్డారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జననాయక్ జనతా పార్టీ అభ్యర్థి అమర్జీత్ ధండా విజయం సాధించారు. బీజేపీకి చెందిన పర్మిందర్ సింగ్ ధుల్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.