హోలీ స్పెషల్.. ప్రేయసితో మెరిసిన పాండ్యా
By న్యూస్‌మీటర్ తెలుగు
దేశ ప్రజలంతా మంగళవారం హోలీ పండగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. కరోనా వైరస్ కారణంగా సహజ సిద్ధమైన రంగులనే వాడుతూ హోలీని జరుపుకుంటున్నారు. ఇక.. ముందుగానే ప్రధాని మోదీ ఈ సారి హోలీ జరుపుకోవడం లేదని ప్రకటించగా.. టీం ఇండియా క్రికెటర్లు హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో వేదికలలో షేర్ చేసి అభిమానులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేయగా.. యువ ఆల్‌రౌండర్స్ హార్ధిక్, కృనాల్ మాత్రం మాత్రం అదరగొట్టారు.
హర్దిక్ పాండ్యా తన ప్రేయసి నటాషా, సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి హోలీ వేడుక చేసుకున్నారు. ఈ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేయగా అభమానుల నుండి మంచి స్పందన వస్తుంది. వీరితో పాటు టీమిండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్ తమ అభిమానులకు, దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.