మీరు చేసిందే క‌రెక్ట్ : హర్భజన్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Dec 2019 10:45 AM GMT
మీరు చేసిందే క‌రెక్ట్ : హర్భజన్‌

దిశ హత్యాచార ఘటనలో నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఇక ముందు ఎవ‌రైనా ఇలాంటివి చేయాలంటే.. ధైర్యం చేయకుండా ఉండాలంటే ఎన్‌కౌంట‌రే బెట‌ర‌ని పేర్కొన్నాడు. ఈ విష‌య‌మై తెలంగాణ సీఎం కేసీఆర్‌ను, పోలీసులను భ‌జ్జీ అభినందించాడు. మీరు చేసింది కచ్చితంగా అభినందనీయ‌మ‌ని ట్వీట్ చేశాడు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హ‌త్య‌ కేసు నిందితులను పోలీసులు శుక్రవారం ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశ అత్యాచారానికి గురైన ప్రాంతం తొండుపల్లి టోల్‌ప్లాజా సర్వీసు రోడ్డు నుంచి పెట్రోల్, డీజిల్‌ పోసి మృతదేహాన్ని కాల్చిన చటాన్‌పల్లి అండర్‌పాస్‌ ప్రాంతంలో క్రైమ్‌ సీన్‌ను రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా ఒక్క‌సారిగా పోలీసుల‌పై రాళ్లు రువ్వుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆత్మ‌ర‌క్ష‌ణ‌పై కాల్పులు జ‌రిపిన పోలీసులు.. నిందితుల‌ను మ‌ట్టుబెట్టారు.



Next Story