కరోనా వేళ బరితెగించిన ఉగ్రమూకలు.. ఐదుగురు జవాన్ల మృతి
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 3 May 2020 10:25 AM IST

ఓ పక్క ప్రపంచమంతా కరోనాతో అట్టుడికిపోతుంటే.. ఉగ్రమూకల అరాచకాలు మాత్రం ఆగట్లేదు. తాజాగా.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వివరాళ్లోకెళితే.. కుప్వారా జిల్లాల్లోని హంద్వారాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్లపై దాడికి దిగడంతో.. ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ కమాండింగ్ ఆఫీసర్, మేజర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ఎదురుకాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. ఎన్‌కౌంటర్ నేఫథ్యంలో.. హంద్వారా ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. అక్కడ ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేశారు.
Next Story