బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. సొంత అన్ననే గొంతు నొక్కి..

By అంజి  Published on  9 Feb 2020 7:22 AM GMT
బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. సొంత అన్ననే గొంతు నొక్కి..

గుంటూరు: నరసరావుపేట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. పోలీసుల అనుమానమే నిజమైంది. తనుషా అనుమానాస్పదమృతిపై పోలీసులు నిజాలను వెలుగులోకి తెచ్చారు. తనూషను హత్య చేసింది సొంత అన్నేనని పోలీసులు నిర్దారించారు. తనూష ప్రవర్తనపై అన్న కుమారస్వామి అభ్యంతరం తెలుపుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. నా జీవితం నా ఇష్టం అంటూ అన్నపై తనూష (16) తిరగబడింది. దీంతో ఆవేశంలో తనూషపై అన్న కుమార స్వామి దాడి చేశాడు. గొంతు నొక్కడంతో ఊపిరాడక తనూష మృతి చెందింది. ఎవరో ముగ్గురు ఇంట్లోకి వచ్చి తనూషను చంపారని సొంత అన్న కుమారస్వామి డ్రామాలాడాడు. సాయంత్రం మీడియా ముందుకు నిందితుడు కుమార స్వామిని పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.

లింగంగుంట్ల కాలనీలో బసవయ్య అనే వ్యక్తి ప్రింటింగ్‌ ప్రెస్‌ నడుపుతున్నాడు. శుక్రవారం తన బంధువుల ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి భార్య, కూతురు అనుషా, కుమారుడు కుమార స్వామిలతో కలిసి బసవయ్య వెళ్లాడు. తిరిగి అతని కుమార్తె, కుమారుడు నర్సారావుపేటలోని ఇంటికి వచ్చారు. రాత్రి ఇంట్లో నిద్రించిన ఇద్దరూ.. తెల్లారేసరికి అనుషా విగతజీవిగా కనిపించింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి ఇంట్లో చొరబడి అనుషాను హత్య చేశారని సోదరుడు కుమారస్వామి చెప్పుకొచ్చాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌ స్వ్కాడ్‌ను దర్యాప్తు చేస్తుండగా.. అది కుమారస్వామి చుట్టూనే తిరిగింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని అసలు విషయాన్ని వెలుగులోకి వచ్చారు.

Next Story