వివాహిత స్నానం చేస్తుండగా.. రహస్యంగా వీడియోతీసి.. కోరిక తీర్చాలంటూ

ఓ వివాహిత స్నానం చేస్తుండగా.. ఓ యువకుడు రహస్యంగా వీడియో తీశాడు. తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించేవాడు. ఆ యువకుడు అడినంత డబ్బు ను అతనికి ఇచ్చింది. అయినా యువకుడి వేధింపులు ఆగలేదు.. భర్త కూడా సూటిపోటీ మాటలతో వేదిస్తుండడంతో తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

గతేడాది పాతబస్తీలోని ఉప్పగూడ హనుమాన్‌నగర్‌కు చెందిన వివాహిత.. స్నానం చేస్తుండగడా అదే ప్రాంతానికి చెందిన యువకుడు వీడియో తీశాడు. అనంతరం బాధితురాలికి ఫోన్‌ చేసి అడిగినంత డబ్బు ఇవ్వాలని.. లేకపోతే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించేవాడు. భయపడిన బాధితురాలు భర్తకు తెలియకుండా రెండు దఫాలుగా రూ.1.92 లక్షలతో పాటు మూడు తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది.

ఈ విషయం భర్తకు తెలిసి డిసెంబర్‌ 19న భార్యతో కలిసి చత్రినాక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇక అప్పటి నుంచి ఆ వివాహితకు వేధింపులు ఎక్కువయ్యాయి. భర్త, అత్తింతి వారు సూటిపోటి మాటలతో వేధించేవారు. తట్టుకోలేని ఆమె డిసెంబర్‌ 31న ఆత్మహత్యకు యత్నించింది. ప్రాణపాయం తప్పడంతో.. అప్పటి నుంచి సుభాష్‌నగర్‌లోని పుట్టింట్లో ఉంటోంది.

యువకుడి వేధింపులు, భర్త తనను పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన వివాహిత శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి వేధింపులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం.. భర్త సూటిపోటి మాటల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్