శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకున్న 16 మంది గల్ఫ్ బాధితులు

By సుభాష్  Published on  15 Feb 2020 5:24 AM GMT
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకున్న 16 మంది గల్ఫ్ బాధితులు

16 మంది గల్ప్‌ బాధితులు శనివారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం పని నిమిత్తం ఇరాక్‌ వెళ్లిన బాధితులు.. ఆరు నెలలుగా తిండి లేక నానా అవస్థలు పడ్డారు. అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతుండటంతో బాధిత కుటుంబీకులు తెలంగాణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమవారిని సొంత గ్రామాలకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వాలు గల్ప్‌ లో ఉన్న బాధితులను క్షేమంగా స్వగ్రామాలకు రప్పించేలా చర్యలు తీసుకున్నారు. సొంత గ్రామాలకు రప్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, మంత్రి కేటీఆర్‌కు, ఇతర అధికారులకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

Next Story
Share it