ట్రంప్‌ భార్యకు బహుమతిగా ప్రత్యేకమైన చీర.. దాని ప్రత్యేకత ఏంటంటే

By సుభాష్  Published on  23 Feb 2020 3:08 PM GMT
ట్రంప్‌ భార్యకు బహుమతిగా ప్రత్యేకమైన చీర.. దాని ప్రత్యేకత ఏంటంటే

► చీర తయారీలో అన్ని సహజమైన రంగులే

► చీర తయారు కావాలంటే సుమారు ఆరు నెలల సమయం

► స్వచ్ఛమైన పట్టు

►ట్రంప్‌ భార్యకు బహుమతి ఇవ్వనున్న మోదీ

అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రేపు భారత్‌కు విచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 24, 25 రెండు రోజులపాటు ట్రంప్‌ దంపతులు భారత్‌లో పర్యటిస్తారు. ట్రంప్‌ మొదటిసారిగా భారత్‌కు వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తోంది భారత్‌. కాగా, ట్రంప్‌ భార్యకు మోదీ బహుమతిగా ఇచ్చేందుకు ఓ అరుదైన చీరను సిద్ధం అయింది. ఆ చీర పేరే పటోలా.

ఈ పటోలా చీర ప్రత్యేక ఏమిటీ..?

పటోలా చీర అంటే గుజరాత్‌ సంస్కృతిలో ఓ భాగం. ఈ చీర పేరుతో ఓ ప్రత్యేకత ఉంది. ఆ చీరను పూర్తిగా చేతితోనే నేస్తారు. సుమారు ఆరుగురు బృందం కలిసి ఈ చీరను తయారు చేస్తారు. సుమారు ఆరు నెలలు కష్టపడితేనే ఈ చర తయారవుతుంది.

ఈ చీరలో ఉపయోగించే రంగులు

కాగా, ఈ చీర తయారీలో ఉపయోగించే రంగులు అన్నీ సహజమైనవే ఉంటాయి. చెట్ల నుంచి సేకరించిన సహజమైన రంగులనే వినియోగిస్తారు. అంతేకాదు ఈ చీరలో స్వచ్ఛమైన పట్టును ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఎక్కడ పటోలా చీర కనిపించినా.. అది గుజరాత్‌లో తయారైందనే చెప్పాలి.

ఎన్ని సంవత్సరాలైనా మెరుగు తగ్గదు

ఈ ఎన్నికలో అన్ని ప్రత్యేకతలే. ఎన్నిసంవత్సరాలైనా ఈ చీరలో ఇసుమంత కూడా మెరుగు తగ్గదు. ఉతికినా రంగు మారదు. ఈ పటోలా చీరకు సుమారు 90 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ తరహాలో తయారయ్యే ఇండస్ట్రీ లేదట. పఠాన్‌లోని సాల్వి కుటుంబమే ఈ పటోలా చీరను తయారు చేస్తోంది. సుమారు 30 తరాల నుంచి ఆ కుటుంబంలో పటోలా చీర తయారీలో ఉంది. గతంలో ఇండొనేసియా, మలేసియాలకు ఈ పటోలా చీరలు అత్యధికంగా ఎగుమతి అయ్యేవి. గత ఏడాదిగా విదేశాల నుంచి ఈ చీరకు ఆర్డర్స్ వస్తున్నాయి.

Next Story