Fact Check : గూగుల్ సీఈవో తన టీచర్ ను 26 సంవత్సరాల తర్వాత కలిశాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Aug 2020 1:59 PM GMT
Fact Check : గూగుల్ సీఈవో తన టీచర్ ను 26 సంవత్సరాల తర్వాత కలిశాడా..?

26 సంవత్సరాల తర్వాత ఓ వ్యక్తి తనకు చదువు చెప్పిన టీచర్ ను కలిశాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ వీడియోను పలువురు తమ తమ ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు.

‘Rajanikanthpabba’ అనే ట్విట్టర్ ఖాతాలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన టీచర్ ను 26 సంవత్సరాల తర్వాత కలిశాడంటూ వీడియోను పోస్టు చేశారు. "#Google CEO Sunder Pichai meets his teacher after 26yrs watch a great humane gesture….👌👌👌(sic)”. అంటూ తన ట్వీట్ లో తెలిపారు.



గ్రేట్ తెలంగాణ టీవీ కూడా ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేసింది. గూగుల్ సీఈవో 26 సంవత్సరాల తర్వాత టీచర్ ను కలిసిన మధుర క్షణాలు అంటూ ఆ వీడియో ను పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

సుందర్ పిచాయ్ తన టీచర్ ను కలిసిన వీడియో అంటూ వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.

ఆ వీడియోలో పెద్దావిడను కలిసిన వ్యక్తి సుందర్ పిచాయ్ అంటూ చెబుతూ ఉండడంలో ఎటువంటి నిజం లేదు. కింది ఫోటోలలో సుందర్ పిచాయ్ కూ.. వీడియోలో ఉన్న వ్యక్తికి మధ్య తేడాను గమనించవచ్చు.

S1

వైరల్ అవుతున్న వీడియో ఆఖరులో ‘A tribute to the hidden counselor in Molly Abraham’ అంటూ రావడం గమనించవచ్చు. ఆ పదాలను ఉపయోగించి కీవర్డ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్నది గమనించవచ్చు. సెప్టెంబర్ 1, 2017 లో ‘IC3 Movement’ అనే యుట్యూబ్ పేజీలో అప్లోడ్ చేయడం గమనించవచ్చు.

ఆ వీడియోలో ఉన్న వ్యక్తి గణేష్ కోహ్లీ. ‘IC3 Institute’ ఫౌండర్ గా ఉన్నారు. తన సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థుల కెరీర్లపై దృష్టి పెట్టేలా చేశారు. ఆ వీడియో తన గణితం టీచర్ ను 26 సంవత్సరాల తర్వాత కలిసిన ఘటనను రికార్డు చేసి తమ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు.



ఆ వీడియోను పూర్తిగా చూడకుండా కొందరు ఆ వీడియోలో ఉన్నది సుందర్ పిచాయ్ అంటూ చెప్పుకొచ్చారు. ఆగష్టు 14, 2020న గణేష్ కోహ్లీ వైరల్ అవుతున్న పోస్టులు పచ్చి అబద్ధం అంటూ చెప్పుకొచ్చారు. మూడేళ్ళ కిందటి వీడియో ఇటీవలి కాలంలో వైరల్ అవుతోందని.. సత్యా నాదెళ్ల, సుందర్ పిచాయ్ లకు ఆపాదిస్తూ వీడియోను వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఆ వీడియోలో ఉన్నది తానేనని గణేష్ కోహ్లీ చెప్పుకొచ్చారు. తన కామెంట్ సెక్షన్ లో పూర్తీ వీడియోను కూడా షేర్ చేశారు గణేష్ కోహ్లీ.

S2

సుందర్ పిచాయ్ తన టీచర్ ను 26 సంవత్సరాల తర్వాత కలిశాడంటూ వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు. అక్కడ ఉన్నది ‘IC3 Institute’ ఫౌండర్ గణేష్ కోహ్లీ.

Next Story