పంచాయతీ ఉద్యోగులకు స‌ర్కార్‌ తీపికబురు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 April 2020 7:50 AM GMT
పంచాయతీ ఉద్యోగులకు స‌ర్కార్‌ తీపికబురు

క‌రోనా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న త‌రుణంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులకు, సిబ్బందికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రతీ నెలా వారికి రూ. 8,500 వేతనం చెల్లించనున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ కమీషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇక నుండి ప్రతీ నెలా ఒకటవ తేదీనే సిబ్బందికి వేతనాలు ఇవ్వ‌నున్న‌ట్లు స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇందుకై రాష్ట్ర ప్ర‌భుత్వం పంచాయతీలకు ప్రతి నెలా ఇచ్చే రూ. 336 కోట్ల నిధుల నుంచి సిబ్బంది వేతనాలు చెల్లించాల‌ని సూచించింది. ఈ నిబంధనలను పాటించని పంచాయతీలపై తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018 కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

Next Story
Share it