మన రాత మనమే రాసుకోవాలా అంటున్న సఖి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2020 10:15 AM GMT
మన రాత మనమే రాసుకోవాలా అంటున్న సఖి..!

కీర్తి సురేష్ అంటేనే కంటెంట్ ఉన్న సినిమాలు అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. 'మహానటి' సినిమా తర్వాత తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ మరో వైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది కీర్తి సురేష్. లాక్ డౌన్ సమయంలో పెంగ్విన్ సినిమా ద్వారా ఓటీటీలో అలరించిన కీర్తి సురేష్ ఇప్పుడు 'గుడ్ ల‌క్ స‌ఖి' సినిమా ద్వారా రాబోతోంది.

'గుడ్ ల‌క్ స‌ఖి' టీజ‌ర్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుదలయింది. పల్లెటూరి అమ్మాయికి ఏదీ కలిసి రాదు.. అందుకే ఆమెకు లక్ అన్నదే లేదు అన్నది ఊర్లో వారి నమ్మకం. అలాంటి అమ్మాయి రైఫిల్ షూటింగ్ రంగంలో ఎలా రాణించింది అన్నదే సినిమా కథ అని టీజర్ ద్వారా తెలుస్తోంది.

ఆది పినిశెట్టి సఖి ప్రియుడిగా నటిస్తూ ఉండగా.. ఆమె కోచ్‌గా జగపతి బాబు నటిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను సుధీర్‌, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Next Story