సాహితీవేత్త, ప్ర‌ముఖ న‌టుడు, జ‌ర్న‌లిస్ట్, ర‌చ‌యిత గొల్ల‌పూడి మారుతీరావు క‌న్నుమూశారు. గ‌త‌కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చైన్నైలోని ఓ ప్ర‌వైట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ కొద్ద‌సేప‌టి క్రిత‌మే మృతిచెందారు. 1939 ఏప్రిల్ 14న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌న్మించిన గొల్ల‌పూడి.. సినిమాల్లోకి రాక‌ముందు ఆకాశ‌వాణిలో ప‌నిచేసేవారు. ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమా ద్వారా సినీరంగ ప్ర‌వేశం చేసిన ఆయ‌న సుమారు 290 సినిమాల్లో న‌టించారు.

గొల్ల‌పూడి కేవ‌లం న‌టుడిగానే కాకుండా.. ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి. సినిమాలోకి రాక‌ముందు న‌వ‌ల‌లు, నాట‌కాలు, క‌థ‌లు రాసేవారు. 1996లో ఉత్త‌మ టీవీ న‌టుడిగా నంది పుర‌స్కారాన్ని అందుకున్న గొల్ల‌పూడి.. అనంత‌రం ఆరు నంది అవార్డుల‌ను అందుకున్నారు. గొల్ల‌పూడి ర‌చ‌న‌ల‌ను యూనివ‌ర్సిటీల‌లో పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారంటే ఆయ‌నెంత గొప్ప ర‌చ‌యిత అర్థం చేసుకోవ‌చ్చు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story