'మెగాస్టార్ - కొరటాల' సినిమా విశేషాలు..!

By అంజి  Published on  10 Dec 2019 3:43 AM GMT
మెగాస్టార్ - కొరటాల సినిమా విశేషాలు..!

కూల్ డైరెక్టర్ కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రసుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ సిట్టింగ్స్ లో మణిశర్మతో పాటు కొరటాల అలాగే డైలాగ్ రైటర్ శ్రీధర్ సీపాన కూడా పాల్గొంటున్నారు. అయితే ఒక్కసారి చిరు, కొరటాల సినిమాలో ఉండబోయే అంశాలు, ఉండని అంశాలు ఏమిటో చూస్తే.. ముందుగా అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ కొరటాల బాగా చూపిస్తాడు. కాబట్టి సినిమాలో బోలెడంత హీరోయిజమ్ ఉంటుంది. అలాగే చిరు ప్రధాన బలమైన డ్యాన్సులు విషయానికొస్తే తన చిత్రంలో మంచి సాంగ్స్, డ్యాన్సులు ఉండేలా చూస్తాడు కొరటాల. ఆ రకంగా చిరు నుండి 'ఖైదీ నెం 150' లెవల్లో స్టెప్స్ ఆశించవచ్చు. ఎలాగూ మణిశర్మ మాస్ బిట్స్ కూడా హైలైట్ గా ఉంటాయి.

ఇక మెగాస్టార్ కామెడీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన తన బాడీ లాంగ్వేజ్ తోనే కామెడీని పండిస్తారు. ఆ కామెడీని అభిమానులు ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు. కానీ కొరటాల శివ సినిమాల్లో కామెడీ పెద్దగా ఉండదు. పైగా కొరటాల సినిమాల్లోని హీరోలంతా ఎప్పుడూ ఏదొక సోషల్ పాయింట్ ను పట్టుకుని సీరియస్ మోడ్ లోనే ఉంటారు. దీనికితోడు కామెడీ లాంటి ట్రాక్స్ కొరటాల ఎప్పుడూ రాసింది కూడా లేదు. కాబట్టి ఈ సినిమాలో కామెడీకి స్కోప్ ఉండకపోవచ్చు. అయితే అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ వీరి నుండి రావడం ఖాయం. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలకమైన సీన్స్ ను షూట్ చేయనున్నారు. అన్నట్లు ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.

Next Story
Share it