భారీగా పెరిగిన బంగారం ధరలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2020 5:42 PM IST
భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు క్ర‌మంగా మూడోరోజు కూడా భారీగా పెరిగాయి. శుక్రవారం పది గ్రాముల పసిడి ధర రూ.791 పెరిగి ఫైన‌ల్‌గా రూ.51,717 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు జోరందుకోవడంతో దేశీయ మార్కెట్లపైనా దాని ప్రభావం పడిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్ వెల్లడించింది.

అంత‌కుముందు ట్రేడింగ్‌లో బంగారం ధర పది గ్రాములకు రూ. 50,926 వద్ద ముగిసింది. కాగా బంగారంతో పాటు వెండి కూడా ఇవాళ భారీ స్థాయిలో పెరిగింది. కిలో వెండి ధర ఏకంగా రూ. 2,147 పెరిగి రూ. 64,578కి చేరింది. గత ట్రేడింగ్‌లో ఇది రూ. 62,431 వద్ద క్లోజ్ అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,950 డాలర్లుగా ఉండగా.. వెండి ధర ఔన్సుకు 25.44 వద్ద కొనసాగుతోంది.

Next Story