దీపావళి బంపర్ ఆఫర్ : రూ. 101కే స్మార్ట్‌ఫోన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Nov 2020 11:29 AM GMTసాధారణంగా పండగ సీజన్ వచ్చిందంటే చాలు మొబైల్ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తాయి. మొన్నటికిమొన్న దసరా సందర్భంగా అలాంటి ఆఫర్లు ఎన్నో చూశాం మనం. తాజాగా మొబైల్ తయారీ సంస్థ దీపావళి వివో బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి సందర్భంగా వీ 20ఎస్ఈ, వీ 20, ఎక్స్ 50 సీరిస్, వై50 స్మార్ట్‌ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు దీపావళి ఆఫర్లతో కొత్త ఆనందాన్ని వెలిగించండి అంటూ వివో ట్వీట్ చేసింది.
కేవలం రూ. 101 చెల్లించి మీరెంతో ఇష్టపడే వివో ఫోన్‌ను సొంతం చేసుకోండి. దీంతోపాటు అదనపు ప్రయోజనాలను కూడా ఆస్వాదించండని పేర్కొంది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందించనున్నట్లు ట్వీట్‌కు ఫోటోను జతచేసి ట్విటర్‌లో షేర్ చేసింది.
అయితే.. ఎప్పటినుంచి ఎప్పటివరకు ఈ ఆఫర్ అందుబాటులోఉండనుందీ స్పష్టత ఇవ్వలేదు. ఈ ఆఫర్ ప్రకారం మొదట 101 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి పైన పేర్కొన్న వాటిలో నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఫోన్ విలువ మొత్తాన్ని ఎంపికచేసిన సులభ ఈఎంఐ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది.