రాష్ట్రంలో అమెజాన్ భారీ పెట్టుబ‌డులు.. కేటీఆర్ ఏమ‌న్నారంటే..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2020 7:12 AM GMT
రాష్ట్రంలో అమెజాన్ భారీ పెట్టుబ‌డులు.. కేటీఆర్ ఏమ‌న్నారంటే..

హైద‌రాబాద్ : రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌పై ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉద‌యం 11:30 గంట‌ల స‌మ‌యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు ప్ర‌క‌టించినందుకు సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు త‌ర్వాత విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి ఇదే అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అమెజాన్ భారీ పెట్టుబ‌డిని స్వాగ‌తిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందని కేటీఆర్ విశ్వాసం వ్య‌క్తం చేశారు.



కాగా‌, అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్(‌AWS) రాష్ర్టంలో రూ. 20,761 కోట్ల పెట్టుబ‌‌డులు పెట్ట‌నుంది. తెలంగాణ‌లో ప‌లు ప్రాంతాల్లో డేటా కేంద్రాల‌ను అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ ఏర్పాటు చేయ‌నుంది. హైద‌రాబాద్‌లో 2022లో అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ సంస్థ త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించే అవ‌కాశం ఉంది. హైదరాబాదులో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి జోన్‌లో డాటా సెంటర్ల ఏర్పాటు చేయ‌నుంది.

Next Story