కాజల్ ఫిదా అయ్యేలా కాబోయే భర్త పోస్ట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2020 5:12 AM GMT
కాజల్ ఫిదా అయ్యేలా కాబోయే భర్త పోస్ట్..!

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ల‌లో కాజల్ అగర్వాల్ ఒక‌రు. తెలుగు నాట ల‌క్ష్మీ క‌ళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 ఏళ్లు అగ్ర‌క‌థానాయిక‌గా రాణించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగానే ఉన్న కాజల్ కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ విష‌య‌మై కాజ‌ల్ కొద్దిరోజుల క్రితం త‌న ఇన్‌స్టాలో స్పందించారు.

కాజ‌ల్‌ ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూను ఈ నెల 30న వివాహం చేసుకుంటోంది. అయితే.. తాజాగా కాజల్‌తో కలిసి ఉన్న తన ఫొటోను గౌతమ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నిశ్చితార్థం సందర్భంగా తీసిన ఫొటోను తన ఇంట్లో అలంకరించి దానిని ఫొటో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

అయితే.. ఆ ఫొటో వెనకాల ఉన్న బెలూన్ డిజైనింగ్ అందరినీ ఆకట్టుకుంది. కాజల్ కూడా ఆ డిజైనింగ్‌కు ఫిదా అయింది. గౌత‌మ్ పోస్ట్‌కు కాజల్ స్పందిస్తూ.. ఈ పోస్ట్ కూడా డిజైన్ అంశాన్ని ప్రతిబింబిస్తోంది.. అంటూ ల‌వ్ ఎమోజీలు ‌జ‌త‌చేసి కామెంట్ చేసింది. ఇక అక్క‌, బావ‌ల పోస్టుకు నిషా అగ‌ర్వాల్ కూడా స్మైలీ ఎమోజీల‌తో ఓ కామెంట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

View this post on Instagram

♾🎈

A post shared by Gautam Kitchlu (@kitchlug) on

Next Story