ఏపీలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం
By తోట వంశీ కుమార్ Published on 1 Jun 2020 12:13 PM ISTవిశాఖ ఆర్.ఆర్.వెంకటాపురం సమీపంలోని ఎల్జీపాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 13 మంది చనిపోగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఇంకా ఈ ఘటన నుంచి తేరుకోకముందే తూర్పుగోదావరిలో గ్యాస్ లీకేజీ కలకలం రేపుతోంది.
కాకినాడ గ్రామీణ మండలం సర్పవరంలో అర్థరాత్రి గ్యాస్ లీకేజీ కలకలం రేపింది. రసాయన పరిశ్రమ నుంచి గ్యాస్ బక్కసారిగా బయటకు వచ్చింది. గ్యాస్ లీకేజీ అయ్యిందనే సమాచారం అందగానే స్థానికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చారు. గ్యాస్ లీకేజీ అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ లీకేజీకి గల కారణాలు తెలియాల్సి ఉంది. అనంతరం స్థానికులు ఆ పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు.