మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..
By తోట వంశీ కుమార్ Published on 24 April 2020 12:18 PM IST
ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మతిస్థిమితం లేని ఓ బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కుత్బుల్లాపూర్‌కు చెందిన మతిస్థిమితం సరిగా లేని బాలిక(14) ఈ నెల 20 న ఇంటి నుంచి బయటికి వెళ్లింది. చాలా సమయం గడిచిన తిరిగి రాలేదు. బుధవారం రోడామేస్త్రీనగర్‌లో నడుచుకుంటూ వెలుతున్న బాలికను నలుగురు యువకులు ఓ పాడుపడిన భవనంలోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశారు. రెండు రోజులు బాలికకు నరకం చూపించారు. నిన్న రాత్రి బాలిక ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు వెంటనే దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ కాల్ ఆధారంగా.. దేవేందర్‌నగర్‌లో బాధితురాలిని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.