సింగిల్ లేడి కావాలంటే.. ఈ నెంబర్‌కు వాట్సప్ మెసేజ్ చేయండి
By తోట వంశీ కుమార్ Published on 20 April 2020 7:51 PM IST
మీరు ఒంటరిగా ఉన్నారా..? అమ్మాయి కావాలా..? అయితే ఈ నెంబర్‌కు వాట్సప్ చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ఆన్‌లైన్ కేటుగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటూ పోలీసులు ఎంత చెబుతున్నా.. చాలా మంది ఈ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. బ్యాంకు మోసాల పట్ల ప్రజలు అప్రమత్తం కావడంతో అమ్మాయిల వల విసురుతున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు.
హైదరాబాద్ బొల్లారంకు చెందిన వ్యక్తి ఓ మెసేజ్ వచ్చింది. మీకు సింగిల్ లేడీ కావాలంటే ఈ నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పెట్టండి అరగంటలో అమ్మాయి మీ ఇంట్లో ఉంటుందనేది ఆ మెసేజ్ సారాంశం. దీంతో అతడు ఆ నెంబర్ కు మెసేజ్ చేశాడు. చాటింగ్ చేసేది అమ్మాయినే అని నమ్మాడు. ఆ సైబర్ లేడి సూచించిన అకౌంట్ కు రూ.91,000 నగదును ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఆ తరువాత ఆ నెంబర్ కాల్ చేయగా .. స్విచ్ ఆప్ అని వచ్చింది. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.