మాన‌వ సంబంధాలు మంట‌గ‌లిసిపోతున్నాయి. కొడుకును అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన ఆ త‌ల్లి.. ప్రియుడి మోజులో ప‌డింది. త‌మ ఏకాంతానికి కొడుకు అడ్డుగా ఉన్నాడ‌ని.. ప్రియుడి సాయంతో ఆరేళ్ల కుమారుడిని చిత్ర హింస‌లు పెట్టింది. ఆచిత్ర‌హింస‌ల‌కు తాళ‌లేక ఆరేళ్ల ఆ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. కోవై కోవిల్ మేడు ప్రాంతానికి చెందిన దివ్య‌(30)కు కొన్నాళ్ల క్రితం ఓ వ్య‌క్తితో వివాహమైంది. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల వారిద్ద‌రూ విడిపోయారు. దీంతో దివ్య త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి తుడియ‌లూరులో నివాసం ఉంటోంది. ఈ క్ర‌మంలో ఇదే ప్రాంతానికి చెందిన రాజ‌దురైతో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యం క్ర‌మంగా.. వివాహేత‌ర సంబంధానికి దారితీసింది.

భ‌ర్త లేక‌పోవ‌డంతో.. ప్రియుడిని రోజు త‌న ఇంటికే పిలిపించుకుని.. త‌న కామ‌వాంఛ‌లు తీర్చుకునేది. ఇద్ద‌రూ కలిసి వారం రోజుల క్రితం సాయిబాబా కాల‌నీకి త‌మ మ‌కాంను మార్చారు. వీరిద్ద‌రు ఏకాంతంగా ఉండే స‌మ‌యాల్లో పిల్ల‌ల‌ను బ‌య‌టికి పంపేవారు. కాగా.. మంగ‌ళ‌వారం బాలుడు అభిషేక్‌(6) బ‌య‌టికి వెళ్లేందుకు నిరాక‌రించాడు. దీంతో దివ్య‌.. ప్రియుడితో క‌లిసి బాలుడిని టార్చ‌ర్ చేసింది. దీంతో బాలుడికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వెంట‌నే 108 వాహానం ద్వారా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. బాలుడికి ఏమైంద‌ని 108 సిబ్బంది ప్ర‌శ్నించ‌గా.. వారిద్ద‌రూ పొంత‌న లేని స‌మాధానాల‌ను ఇచ్చారు. దీంతో సిబ్బందికి అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విచార‌ణ‌లో అభిషేన్‌ను తామే హ‌త్య చేసిన‌ట్లు రాజ‌దురై అంగీక‌రించాడు. కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుల‌ను రిమాండ్‌కు త‌ర‌లించ‌గా.. మూడేళ్ల కుమార్తెను శిశు సంక్షణ కేంద్రానికి పంపించారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.