బూసిగూడెంలో దారుణం.. మైనర్‌ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

By అంజి  Published on  28 Feb 2020 4:38 AM GMT
బూసిగూడెంలో దారుణం.. మైనర్‌ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్‌

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం బూసిగూడెంలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కాగా ఈ ఘటనపై రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌లో స్కూల్‌ హెచ్ఎం, వార్డెన్‌ ఫిర్యాదు చేశారు. పోక్సో, దిశ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాధిత విద్యార్థిని బూసిగూడెంలోని ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామని ఇంచార్జి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడింది అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులని పోలీసులు గుర్తించారు.

విశాఖ జిల్లా కశింకోట మండలం ఉగ్గునపాలెంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏనిమిదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా మహిళల, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మానవ మృగాల్లో కనీస మార్పు కూడా రావడం లేదు. కామపు కళ్లతో ఆడవారిపై బలవంతపు అత్యచారాలకు తెగబడుతున్నారు. ఒంటరిగా మహిళలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే.. కామమృగాలు కాటేస్తున్నాయి. ముంబైలో ఓ 19 ఏళ్ల యువతి రెండు గంటల వ్యవధిలో రెండు సార్లు అత్యాచారానికి గురైంది.

Next Story
Share it