ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం: విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు

By సుభాష్  Published on  6 Jun 2020 10:24 AM IST
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం: విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రస్తుతం విద్యార్థులందరూ విద్యను ఆన్‌లైన్‌ ద్వారానే అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఏపీ సర్కార్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ విద్యనభ్యసించే విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ నేతృత్వంలో జరిగిన సంక్షేమ గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

రూ.5 వేల నుంచి రూ.6వేల విలువ చేసే స్మార్ట్‌ ఫోన్లను అందించనుంది. సొసైటీ పరిధిలో 60వేల మంది విద్యార్థులు చదువుతుండగా, వారిలో 30 నుంచి 40శాతం మందికి మాత్రమే స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇదిలా ఉంటే విశాఖలో రెండు, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా ఐఐటీ ట్రైనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. అలాగే పరిశుభ్రత, పచ్చదనం విషయంలో మొదటిస్థానంలో నిలిచే గురుకులానికి రూ.50వేలు, రెండో స్థానంలో నిలిచిన గురుకులానికి రూ.30వేలు ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుంది.

ఇవి చదవండి:

► ఏపీలోలో లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు.. కొత్త మార్గదర్శకాలు విడుదల

► ఏవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అఖిలప్రియ

► కరోనా: ఏపీలో రెడ్‌ జోన్‌ జిల్లాలు, మండలాలు ఇవే..!

Next Story