కరోనా: ఏపీలో రెడ్‌ జోన్‌ జిల్లాలు, మండలాలు ఇవే..!

By సుభాష్  Published on  2 Jun 2020 9:39 AM GMT
కరోనా: ఏపీలో రెడ్‌ జోన్‌ జిల్లాలు, మండలాలు ఇవే..!

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఏపీలో కూడా కరోనా విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. రోజురోజుకు కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. మొదట్లో కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఉదాంతం తర్వాత కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇక ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కూడా కరోనా బారిన పడ్డాయి. ఇందులో భాగంగా ఏపీలో జిల్లాల వారిగా ఏఏ మండలాలు రెడ్‌ జోన్‌లలో ఉన్నాయో గుర్తించింది ఏపీ ప్రభుత్వం.

కృష్ణా జిల్లా:

విజయవాడ రూరల్‌; జగ్గయ్యపేట, విజయవాడఅర్బన్‌, మచిలిపట్నం, నూజివీడు, ముసునూరు, పెన,మలూరు.

గుంటూరు జిల్లా:

అచ్చంపేట, నరసారావుపేట, దాచేపల్లి, గుంటూరు టౌన్‌, తాడేపల్లి, మంగళగిరి.

కర్నూలు జిల్లా:

ఆత్మకూరు, కోడుమూరు, ఆదోని, చిన్నగిరి, ఆస్సరి,తుగ్లలి, కర్నూలు టౌన్‌, నందికోట్కూరు, పాణ్యం, బనగానిపల్లె, నంద్యాల, గడివేముల, చాలగమర్ని, పాములపాడు.

కడప జిల్లా:

ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కడప టౌన్‌, బద్వేల్‌, పులివెందుల, కమలాపురం, మైదుకూరు.

నెల్లూరు జిల్లా:

నెల్లూరు టౌన్‌, వాకాడు, సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట.

అనంతపురం జిల్లా

హిందుపూర్‌, కల్యాణదుర్గం, అనంతపురం టౌన్‌

ప్రకాశం జిల్లా:

కారంచేడు, చీరాల, ఒంగోలు టౌన్‌, గుడ్లూరు

తూర్పుగోదావరి జిల్లా:

సామర్ల కోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్‌, శంకవరం, పిఠాపురం.

చిత్తూరు జిల్లా:

శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్‌, రేణిగుంట, పరదయపాలెం, నాగలాపురం, నగరి, పుత్తూరు, వెంకటగారి కోట, సత్యవేడు

విశాఖ జిల్లా:

కశింకోట, పెందుర్తి, విశాఖ అర్బన్‌, పద్మనాభం, పెదగంట్యాడ, నర్సీపట్నం

విజయనగరం జిల్లా:

బొందుపల్లె, కొమరాడ, పూసపాటిరేగ, బలిజిపేట

పశ్చిమ గోదావరి జిల్లా:

పోలవరం, గోపాలపురం, టి. నరసాపురం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, పెనుగొండ, ఏలూరు, ఆకివీడు, భీమడోలు, ఉండి, భీమవరం, నరసాపురం.

కాగా, తాజాగా మంగళవారం కూడా కరోనా కేసులు బాగానే నమోదయ్యాయి. గ‌డిచిన 24 గంటల్లో 12,613 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో కొత్త‌గా మ‌రో 82 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3200 కి చేరింది. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ 64 మందిని పొట్టనపెట్టుకుంది. ఇక ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల్లో 2,209 మంది డిశ్చార్జి కాగా.. 927 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 112 మందికి కరోనా సోకింది. ఇత‌ర‌ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 479 మంది కరోనా బారినప‌డిన‌ట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

Next Story
Share it