Fact Check : భారత ప్రభుత్వం ఆహార ధాన్యాలను వృధా చేసిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Jun 2020 9:19 AM IST
Fact Check : భారత ప్రభుత్వం ఆహార ధాన్యాలను వృధా చేసిందా..?

"భారత ప్రభుత్వం 65 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను గత నాలుగు నెలల్లో వృధా చేసిందని.. ఓ వైపు పేదలు ఆకలితో అలమటిస్తూ ఉంటుంటే.. భారత ప్రభుత్వం ఆహార ధాన్యాలను గోడౌన్స్ లో మగ్గేలా చేసిందంటూ" ఓ ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ ఆర్టికల్ ను జూన్ 3, 2020న పబ్లిష్ చేసింది.

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ను భారత ప్రభుత్వం అమలు చేసిందని.. ప్రస్తుతం ఉన్న వనరులతో ఎంతో మందికి కడుపు నింపే అవకాశం ఉండేదని.. కానీ ప్రభుత్వం ఆ పని చేయకుండా.. ధాన్యాలను గోడౌన్లలోనే మగ్గిపోయేలా చేసిందని కథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వం దగ్గర ధాన్యాన్ని నిల్వచేసేందుకు సరైన సదుపాయాలు లేవని.. అలా గోడౌన్లలో దాచిన చాలా వరకూ ధాన్యం పాడైందంటూ కథనాలను ప్రచురించింది.

జనవరి 1 నుండి మే 1 మధ్య బియ్యం, గోధుమలను భారత ప్రభుత్వం గోడౌన్లలో దాచి ఉంచిందని.. అలా చేయడం వలన 7.2 లక్షల టన్నుల నుండి 71.8 లక్షల టన్నుల ధాన్యం వృధాగా పోయిందంటూ కథనాలను రాసుకొచ్చింది. పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రజలకు పంచే ధాన్యం కంటే ఇది ఎక్కువని కథనాన్ని ప్రచురుంచింది. ఏప్రిల్-మే నెల లాంటి సంక్షోభ సమయంలో ఎంతో మందికి అండగా నిలబడి ఉండే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయలేదంటూ కథనాన్ని ప్రచురించింది.

https://scroll.in/article/963535/india-let-65-lkh-tonnes-of-grain-go-to-waste-in-four-months-even-as-the-poor-went-hungry

ఆర్కైవ్ చేసిన లింక్

https://web.archive.org/web/20200603041955/https://scroll.in/article/963535/india-let-65-lakh-tonnes-of-grain-go-to-waste-in-four-months-even-as-the-poor-went-hungry

చాలా పబ్లికేషన్స్ కూడా ఈ కథనాన్ని ఫాలో అయ్యాయి. తమ తమ వెబ్ సైట్లలో పోస్టు చేశాయి. మరి కొందరు సోషల్ మీడియాలో సదరు లింక్ లను పోస్టు చేశారు.

https://www.scoopwhoop.com/news/india-wasted-65-lakh-tonnes-foodgrain-in-4-months/

నిజ నిర్ధారణ:

పైన చెప్పిన సమాచారం ప్రజలను తప్పు ద్రోవ పట్టించేదే..!

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కథనాలు తప్పు అంటూ ప్రకటించింది. Foodgrains gone waste అంటూ వచ్చిన కథనంలో ఎటువంటి నిజాలు లేవని చెప్పుకొచ్చింది. @irvpaswan @fooddeptgoi @cabsect_india, @PMOIndia ట్యాగ్ చేస్తూ scroll.in కు ఓ లెటర్ ను పంపింది.

యూనియన్ మినిస్టర్ రామ్ విలాస్ పాశ్వాన్ కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ట్వీట్ ను రీట్వీట్ చేసారు. నిజాలను పట్టించుకోకుండా scroll.in తమ కథనాలను రాసుకుని వచ్చిందని ఆయన విమర్శలు చేశారు. నిజానిజాలు ఇక్కడ ఉన్నాయంటూ ఓ లింక్ ను ఆయన పోస్టు చేశారు.

scroll.in ప్రజలకు తప్పుడు సమాచారాన్ని అందించిందంటూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ లెటర్ లో రాసుకుని వచ్చింది. 71.8 లక్షల మెట్రిక్ టన్నులు అంటూ నోటికి వచ్చిన లెక్కలు రాసుకుని వచ్చిందని అన్నారు. 2019-2020 మధ్య నష్టపోయిన ధాన్యాల లెక్క 1930 మెట్రిక్ టన్నులు మాత్రమేనని.. కేవలం వరదలు లాంటి ప్రక్రుతి వైపరీత్యాల కారణంగా మాత్రమే నష్టపోయామని స్పష్టం చేసింది.

రబీ సీజన్ లో గోధుమలను ఎక్కువ వేస్తుంటారని.. కాబట్టి ప్రభుత్వం స్టోరేజీ హౌస్ లలోకి ధాన్యాన్ని తరలిస్తూ ఉంటుందని మే నెలలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. అలాంటప్పుడు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలించడం జరుగుతూ ఉంటుందని తెలిపింది. వేరు వేరు రాష్ట్రాలకు తరలించడం లాంటివి చేస్తూ ఉంటామని తెలిపింది. లాక్ డౌన్ కారణంగా కొన్ని రాష్ట్రాల నుండి స్టోరేజ్ హౌస్ లకు తరలించడం వీలు కాలేదని స్పష్టం చేసింది. అంతేకానీ అన్ని లక్షల ధాన్యం వృధా అయ్యింది అన్న కథనాలలో ఎక్కడా నిజాలు లేవని తెలిపింది. లాక్ డౌన్ లో ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యాలను ప్రజలకు సరఫరా చేసిందని.. వెల్ఫేర్ స్కీం ల ద్వారా అందించామని స్పష్టం చేసింది.

పిఐబి కూడా ఈ కథనాలను తప్పుబట్టింది. 65 లక్షల టన్నుల ధాన్యాలను భారత ప్రభుత్వం వృధా చేసిందనడంలో ఎక్కడా నిజం లేదని తెలిపింది.

లాక్ డౌన్ సమయంలో 65 లక్షల టన్నుల ధాన్యాలను భారత ప్రభుత్వం వృధా చేసిందన్న కథనాలు ఖచ్చితంగా ప్రజలను తప్పుద్రోవ పట్టించేవే.

Claim Review:Fact Check : భారత ప్రభుత్వం ఆహార ధాన్యాలను వృధా చేసిందా..?
Claim Fact Check:false
Next Story