విశాఖలో మరో అగ్నిప్రమాదం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Aug 2020 5:46 PM IST
విశాఖలో మరో అగ్నిప్రమాదం..

విశాఖ పట్టణాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. వరుస ప్రమాదాలతో వైజాగ్ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎల్జీ పాలిమర్స్, మొన్నటి ఫార్మా సిటీ బ్లాస్ట్, అలానే క్రేన్ ప్రమాదం ఇలా వరుసగా ప్రమాదాలు జరగగా.. ఇప్పుడు విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నిలిపి ఉన్న నౌకలో అగ్నిప్రమాదం జరిగింది. పనామా BD51నౌక క్యాబిన్ నుంచి పొగలు వస్తున్నట్టు గుర్తించారు. చెన్నై నుంచి వచ్చిన ఈ నౌక వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్ లో ఉండగా ఈ ఘటన జరిగింది. అగ్ని ప్రమాదం ఇంజన్ రూమ్ లో కావడంతో గ్యాస్ మాస్కు ధరించి మంటలను అదుపు చేస్తున్నారు సిబ్బంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోర్ట్ అధికారులు అనుమానిస్తున్నారు.

శనివారం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చేపల వేటకు వెళ్లిన ఓ బోటు.. వేట తర్వాత తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే మంటలను గుర్తించిన మత్స్యకారులు పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు కిందకు దూకి ఒడ్డు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూ.50 లక్షలు నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

Next Story