నిజ నిర్ధారణ: ఖమ్మంలో బాణాసంచా దుకాణాలలో భారీ అగ్ని ప్రమాదం ???
By సత్య ప్రియ Published on 28 Oct 2019 9:11 AM GMTబాణాసంచా దుకాణాలలో అగ్ని ప్రమాదం జరిగిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఖమ్మంలోని SR & BGNR కాలేజీ గ్రౌండ్ లో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తునారు. ఈ వీడియో వాట్సాప్, యూట్యూబ్ లలో ఈ రోజు విరివిగా షేర్ చేయబడుతోంది.
ఇందులో దుకాణాలలో నిప్పు అంటుకొని, బాణా సంచా పేలడం, దీనితో చుట్టుపక్కల నిప్పు వ్యాపించి భారీ విస్పోటనం సంభవించడం చూడవచ్చు. ఖమ్మంలో బాణాసంచా షాపులో అగ్ని ప్రమాదం అంటూ యూట్యూబ్ లో పంచుకున్న వీడియో లింకు:
నిజ నిర్ధారణ:
గూగుల్ క్రోం ఎక్ స్టెన్షన్లలో ఒకటి అయిన ఇన్ విడ్ టూల్ ను వాడి వీడియో లోని కొన్ని చిత్రాలను వెలికితీసి బాణాసంచా దుకాణాల్లో అగ్ని ప్రమాదం అని శోధన చేస్తే ఎన్నో యూట్యూబ్ వీడియోలు లభ్యం అయ్యాయి.
న్యూస్ మీటర్ పరిశోధనలో తెలింది ఏమిటంటే, ఈ వీడియో అక్టోబర్ 29, 2016 లో ఔరంగాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసింది. ఈ వార్త కొన్ని వార్తా పత్రికలలో కూడా ప్రచురించబడింది.
కధనాల ప్రకారం, దీపావళి సందర్భంగా పెట్టిన బాణాసంచా దుకాణాలలో అక్టోబర్ 29, 2016 శనివారం నాడు ఉదయం 11.45 నిమిషాలకు నిప్పు అంటుకున్నట్లు తెలుస్తోంది. 150 కి పైగా దుకాణాలు, అక్కడ నిలిపిన 40కి పైగా మోటారు వాహనాలూ దగ్ధం అయ్యాయి.
ఈ వీడియో తెలంగాణాలోని ఖమ్మంకు సంబంధించింది కాదు. ఈ ఉదంతం 2019 లో జరగలేదు. 2016లో ఔరంగాబాద్ లో ని బాణాసంచా దుకాణాలలో అగ్ని ప్రమాదం సంభవించిన వీడియోను ఖమ్మంలో అగ్ని ప్రమాదం జరిగిందని అబద్దపు ప్రచారం చేయడానికి వాడుకున్నారు.
ప్రచారంలో ఉన్నది: ఖమ్మం లోని బాణాసంచా దుకాణాలలో భారీ అగ్ని ప్రమాదం.
ప్రచారం చేసినవారు: వాట్సాప్, యూట్యూబ్
నిజ నిర్ధారణ: అబద్దం. 2016లో ఔరంగాబాద్ లో ని బాణాసంచా దుకాణాలలో అగ్ని ప్రమాదం సంభవించిన వీడియోను ఖమ్మంలో అగ్ని ప్రమాదం జరిగిందని అబద్దపు ప్రచారం చేయడానికి వాడుకున్నారు.