గోషామహల్‌లో భారీ అగ్నిప్రమాదం
By సుభాష్Published on : 6 March 2020 10:52 AM IST

హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీసు స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్టేడియంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు శకటాలతో ఘటన స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. కాగా, ఈ ప్రమాదంలో స్టేడియంలో పలు కేసుల్లో రికవరీ చేసిన వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన వాహనాలను ఇతర పోలీసుస్టేషన్ల నుంచి తీసుకువచ్చి గోషామహల్ స్టేడియంలో భధ్రపరుస్తారు. దగ్ధమైన వాహనాలన్నీ స్ర్కాప్ గా మారాయని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story