విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2020 8:14 AM GMT
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం నగరంలోని బెంజ్‌ సర్కిల్ సమీపంలో ఉన్న రిలయన్స్‌ ఫుట్‌వేర్‌లో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. పొగలు కూడా పెద్ద ఎత్తున కమ్మేయడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఆ భవన సముదాయంలోనే వస్త్ర దుకాణం, కార్పొరేట్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలు ఉన్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 60 శాతానికిపైగా పాదరక్షలు మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌ వ్లలే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.

Next Story
Share it