ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై 420 కేసు నమోదు..

By అంజి  Published on  27 Feb 2020 6:29 AM GMT
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై 420 కేసు నమోదు..

బీహార్‌: ఎన్నికల వ్యూహకర్త, జేడీయా మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఐప్యాక్‌ సంస్థ అధినేత ప్రశాంత్‌ కిషోర్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా పీకేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇటీవలే ప్రశాంత్‌ కిషోర్‌ జేడీయూ పార్టీకి రాజీనామా చేశారు. కాగా ఫిబ్రవరి 20 నుంచి బాత్‌ బీహార్‌ కీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పీకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని కాపీ కొట్టారని తూర్పు చంపారన్‌ జిల్లాకు మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రశాంత్‌ కిషోర్‌పై పోలీసులు 420 కేసు నమోదు చేశారు. బీహార్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని తాను ఈ సంవత్సరం జనవరిలోనే ప్రారంభించానని గౌతమ్‌ పోలీసులకు తెలిపాడు.

అయితే తన కార్యక్రమాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ కాపీ కొట్టారని, ఫిబ్రవరిలో బాత్‌ బీహార్‌ కీ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించాని గౌతమ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా పోలీసులు 420, 406 సెక్షన్ల పీకేపై పోలీసులు తెలిపారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తానని ఈ నెల 18న ప్రశాంత్‌ కిషోర్‌ ప్రకటించారు. బీహార్‌కు కొత్త నాయకుడు అవసరమన్న లక్ష్యంతోనే తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టాని ఆయన తెలిపారు. బీజేపీతో జేడీయూ పార్టీ కలిసి ఉండటాన్ని పీకే తప్పుబట్టారు. రానున్న 100 రోజుల్లో ఈ ఉద్యమంలో కోటి మంది యువతను భాగం చేస్తానన్నారు.

Next Story