Fact Check : మెసేజీలను పంపడానికి ఫేస్ బుక్ ఇకపై డబ్బులు అడుగుతుందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 May 2020 5:34 AM GMTఫేస్ బుక్ యాప్, ఫేస్ మెసెంజర్ ఏదైనా ఉచితంగా పని చేస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాలన్స్ ఉంటే హ్యాపీగా వాడుకోవచ్చు. ఇకపై ఫేస్ బుక్ లో మెసేజీలు పంపితే డబ్బులు కట్టాల్సి వస్తుందంటూ ఓ మెసేజీ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. భారత్ లో కూడా ఈ మెసేజ్ ను పలువురు వైరల్ చేస్తూ ఉన్నారు.
ఆ మెసేజీ ఇలా ఉంది.. “As of Saturday morning, Facebook will become chargeable. If you have at least 10 contacts send them this message. In this way we will see that you are an avid user and your logo will turn blue (�) and will remain free. As discussed in the paper today, Facebook will cost 0.01ps per message. Send this message to 10 people. When you do the light will turn blue otherwise Facebook will activate billing.”
�
'వచ్చే శనివారం నుండి ఫేస్ బుక్ లో మెసేజీలు పంపాలి అంటే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. మీరు కనీసం 10 మందికి ఈ మెసేజీ పంపితే అప్పుడు బ్లూ కలర్ లో మారుతుంది. ఇకపై ఫేస్ బుక్ ఒక్కో మెసేజీకి 0.01 పైసలు కట్ చేస్తుంది. ఈ మెసేజీని 10 మందికి పంపండి.. అప్పుడు బ్లూ కలర్ పడితే ఫ్రీ గా మెసేజీలు పంపొచ్చు.. లేదంటే బిల్లింగ్ అన్నది యాక్టివ్ అవుతుంది' అని ఆ ఫార్వర్డ్ మెసేజీలో ఉంది.
ఈ మెసేజీ చాలా ఏళ్లుగా వైరల్ అవుతోంది. ఇదంతా పచ్చి అబద్ధమని తేలింది.
నిజమెంత:
న్యూస్ మీటర్ ఈ మెసేజీపై ఫ్యాక్ట్ చేయగా.. అబద్ధమని తేలింది. గత మూడేళ్ళుగా ఇలాంటి మెసేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఫేస్ బుక్ కూడా గతంలో ఈ మెసేజీని బహిరంగంగా ఖండించింది. ఫేస్ బుక్ ఎట్టి పరిస్థితుల్లోనూ మెసేజీలకు ఛార్జ్ చేయబడదు అని తెలిపారు.
ఇలాంటి వన్నీ ఈమెయిల్స్ ద్వారా తయారు చేస్తారు. స్పామర్లు, స్కామర్లు ఇలాంటి వాటిని ఫార్వర్డ్ చేసి.. డేటాను దొంగిలించాలని భావిస్తూఉంటారు. అందుకు ఫేస్ బుక్ ను కూడా వాడుకుంటున్నారని.. ఇలాంటి వాటిని నమ్మకండని ఫేస్ బుక్ ప్రతినిధులు ఇప్పటికే చాలా సార్లు బహిరంగంగా స్పష్టం చేశారు.
ఫేస్ బుక్ ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులను ఛార్జ్ చేయదని సంస్థ ప్రకటించింది. తాము కేవలం ప్రకటనల విషయంలో మాత్రమే ఛార్జ్ చేస్తామని.. ప్రకటనల ద్వారా ఆర్జించిన సొమ్మును ఉపయోగించడం ద్వారా అందరికీ ఫేస్ బుక్ అన్నది ఫ్రీగా అందిస్తున్నామని సంస్థకు చెందిన అధికారులు తెలిపారు.
కొన్ని పేజీలు కండక్ట్ చేసే ఈవెంట్స్ కు ఛార్జ్ చేయాలని అనుకుంటున్నామని ఫేస్ బుక్ ఏప్రిల్, 2020 న స్పష్టం చేసింది. అంతేకానీ ఇంకా ఆచరణలో కూడా పెట్టలేదు.
నిజమేమిటంటే: ఫేస్ బుక్ లో మెసేజీని పంపడం ద్వారా 0.01 పైసలు కట్ అవుతాయని వస్తున్న మెసేజీ పచ్చి అబద్ధం.